పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి. నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి మే 19
అల్లూరి సీతారామరాజు జిల్లా,చింతూరు ఐటీడీఏ ఎదురుగా 5 వ ఈరోజు దీక్షలు కు(టీ.ఏ.సి) ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసి తీర్మానం చేసి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం చేయాలని రిలే నిరాహార దీక్షలు ను మడకం. లక్ష్మణ్, ఆత్రం ఉదయ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు.ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఆదివాసీ జేఏసీ కార్యదర్శి కాకా సీతరామయ్య మాట్లాడుతూ…2025 మెగా డీఎస్సీ నుండి ఏజెన్సీ ఆదివాసి ఉపాధ్యాయ పోస్టులు మినహాయించి ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని,ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్(TAC) ఏర్పాటుచేయాలని,షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం చేయాలని,జీవో నెంబర్ 3 చట్ట బద్ధత కల్పిస్తామని ఎన్నికల ముందు అరకులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేయాలని,వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఎస్టి బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని,ఐటిడిఏల ద్వారా ట్రైకార్ రుణాలు నిరుద్యోగ యువతకు మంజూరు చేయాలని,ఆదివాసీ హక్కులు,చట్టాలను పగడ్బందీగా అమలుచేయాలని మొదలైన సమస్యల పరిష్కారం కోసం సిఎం చంద్రబాబు నాయుడు గారు ఆదివాసీలకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామన్నారు.ఈ సందర్భంగా ఆదివాసీలకు వందశాతం ఉద్యోగాలను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబటి ఉన్నాము అని ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్ ఆదివాస జేఏసీ పోరాటం ఆగదు అన్నారు ప్రభుత్వం చట్టం చేసే వరకు ఈ దీక్షలు ఆపేది లేద్దన్నారు ఈ దీక్షల లో మడివి. శైలు, మడకం భవాని, మడకం రాధా, మడకం సంగీత, లక్షిమిదేవి, మడకం గౌతమీ, మడివి, తరుణ్, మడకం, పవన్, మడకం, చందు, మడివి లలిత, మడివి గంగు, మడివి సుందర్ మడివి శైలజ మడివి సాయి, ముచ్చిక. బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.