
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం తేది 09-01-2026 నుండి 20-01-2026 వరకు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టి జి ఎస్ ఆర్ టి సి నిజామాబాద్ రీజియన్ ప్రత్యేక బస్సు సౌకర్యాలను కల్పిస్తోంది. సికింద్రాబాద్ నుండి నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ కామారెడ్డి లకు ప్రత్యేక అదనపు బస్సులు ఏర్పాటు చేస్తూ మరియు తిరుగు ప్రయాణీకులకు బస్సు సౌకర్యాం కలదు అని తెలుపుతూ మరియు మహాలక్ష్మి పథకం కూడా వర్తిస్తుంది అని నిజామాబాద్ రీజియన్ మేనేజర్ టి. జ్యోష్న ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ రీజియన్ మేనేజర్ శ్రీమతి టి. జ్యోష్న గారు మాట్లాడుతూ-"సంక్రాంతి సందర్భంగా టి జి ఎస్ ఆర్ టి సి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కే జి ఎస్ ఆర్ టి సి సురక్షితం మరియు సుఖవంత ప్రయాణం చేస్తు తమ గమ్యాన్ని చేరుకోగకారని తెలిపారు.
నిజామాబాద్-1..96 ప్రత్యేక బస్సులు నిజామాబాద్-2…53 ఆర్మూర్94 బోదన్86 బాన్సువాడ74 కామారెడ్డి97
మొత్తం..500 నిజామాబాద్ రీజియన్ ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా JBS బస్టాండులో డిపోల వారిగా ప్రత్యేక ఆఫీసర్ లను ఏర్పాటు చెయ్యడం జరిగింది. "ప్రయాణీకులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవడం ద్వారా సౌకర్యవంతంగా, ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చు. టికెట్ బుకింగ్ సౌకర్యం RTC ఆన్లైన్ వెబ్సైట్ (www.tgartcbus.in) మరియు TGSRTC గమ్యం యాప్ లో అందుబాటులో ఉంది" అని తెలిపారు.
