టి సి వి డి ఎస్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపెళ్లి వెంకటేశ్వర్లు.
పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 16, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను ఆన్లైన్ సేవలను సి ఎస్ సి (కామన్ సర్వీస్ సెంటర్ )లకు కేటాయించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపెల్లి వెంకటేశ్వర్లు సోమవారం జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా వినతి పత్రాన్ని సమర్పించారు. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్లో గత తొమ్మిది పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు మరియు కొన్ని రాష్ట్ర సర్వేలకు సంబంధించిన సేవలను ప్రజల వద్దకు తీసుకువెళ్లి సంబంధించినటు వంటి నూతన సంక్షేమ పథకాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ మా యొక్క సెంటర్లలో ఆన్లైన్ సర్వీసులు అందిస్తున్నామని అలాగే సి ఎస్ సి సెంటర్ ద్వారా మాకు స్వయం ఉపాధి చేసుకుంటున్నామని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఆన్లైన్లో మా సిఎస్సి సెంటర్లకు కేటాయించినట్లయితే రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో ఉన్న 13000 సి ఎస్ సి లు ఉన్నాయి. కాబట్టి అధిక మొత్తంలో ప్రజలు గ్రామీణ స్థాయి వరకు చేరుకునే అవకాశం ఉంటుంది అలాగే ఆన్లైన్లో చేసుకునే సమయంలో వారికి సమయం వృధా కాకుండా ఒక గ్రామం నుంచి మండలానికి వెళ్లకుండా ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజా ప్రభుత్వం ఆశయం కూడా నెరవేరుతుందని అట్టి సంక్షేమ పథకాలను వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్టి ఆన్లైన్ సర్వీసులను తమ సిఎస్సి సెంటర్ కు కేటాయించాలని ఈ కార్యక్రమం ద్వారా వినతిపత్రాన్ని సంబంధిత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో టిసివిడిఎస్ఎస్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీలు కొన్నే రామకృష్ణ, వగలబోయిన కృష్ణ, జిల్లా వి ఎల్ ఇ లు అనుప మహేందర్, తీగల అశోక్, భాషపాక విష్ణు, తదితరులు పాల్గొన్నారు.