నరసింహస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. కేశంపేట మండలం సంతాపూర్ గ్రామ పరిధిలో ఉన్న శ్రీశ్రీశ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొన్నారు.నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పవిత్రమైన సందర్భాలలో పాల్గొనడం ఎంతో అనందదాయకమన్నారు.ఈ వేడుకలో భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామివారి కళ్యాణ మహోత్సవం లో పాల్గొని నరసింహస్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.కార్యక్రమంలో సంతపూర్ మాజీ సర్పంచ్ వరలక్ష్మి ప్రభాకర్ రెడ్డి, పాపిరెడ్డిగూడెం మాజీ సర్పంచ్ తాండ్ర విష్ణువర్ధన్ రెడ్డి,కాకునూరు మాజీ సర్పంచ్ యారం శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నాగిళ్ల వెంకటేష్,సాజీద్,నరేందర్ రెడ్డి,కొత్తపేట జగన్ రెడ్డి, యాదయ్య గౌడ్, క్రిష్ణ, రజినీకాంత్ గౌడ్ గ్రామస్తులు ప్రజలు పాల్గొన్నారు