
మార్చి 5 నుండి ప్రతి గురువారం బూర్గుల లో ( అంగడి) సంత
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం బూర్గుల గ్రామంలో త్వరలో ప్రారంభం కాబోతున్న అంగడి ( సంత ) ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను ఆహ్వానించడం జరిగింది. అదే విధంగా షాద్నగర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అందే మోహన్ ను కూడా సంత ప్రారంభోత్సవానికి రావాలని మరియు సంతకు సంబంధించిన కరపత్రం అందజేయడం జరిగింది. బూర్గుల సర్పంచ్ చిలుకమర్రి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి తో పాటు వార్డు సభ్యులు కవిత సత్యనారాయణ స్వప్న పవన్ కుమార్ సంతోష్ కుమార్ గౌడ్ హరీశ్వర్ శేఖర్ మాజీ సర్పంచ్ పరుశురాం జంగయ్య రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
