
…… కుంజ శ్రీను.
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ నవంబర్ 1
కూనవరం మండల పరిధిలో గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్ని అక్రమ కట్టడాలు గుర్తించారు, గుర్తించిన వాటిలో ఎన్ని తొలగించారు. వాటికి సంబంధించిన వివరాలు సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ఇవ్వాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24 వా తేదీన కూనవరం తాసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు పెట్టడం జరిగిందని. దరఖాస్తు గడువు ముగిసి అదనంగా వారం రోజులు గడిచిన ఎప్పటి వరకు ఏ రకమైన సమాచారం అందించలేదని కావున కూనవరం మండల తాసిల్దార్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా సమాచారాన్ని అందించడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసినందుకు గాను జరిమానా విధించాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను చింతూరు సబ్ కలెక్టర్ వారిని పత్రిక ముఖ్యంగా కోరడం జరిగింది. వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, కూనవరం మండల ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు కూడా చేయటం జరిగిందని ఆ దరఖాస్తుకు కూడా ఇప్పటివరకు ఎటువంటి అండర్స్మెంటు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. సమస్యపై దరఖాస్తు ఇచ్చినప్పుడు దానికి జవాబుదారితనం వహించినప్పుడు అధికారిపై ఎందుకు శాఖా పరమైన చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలని ఆయన కూనవరం మండల తాసిల్దార్ ను ప్రశ్నించారు. అక్రమ కట్టడాలను గుర్తించి కూడా వాటిని తొలగించకుండా ఉండటం ఆ సమాచారం అడిగితే ఉద్దేశపూర్వకంగా ఇవ్వకుండా ఉండటం ఇవన్నీ చూస్తా ఉంటే రెవెన్యూ అధికారులు నాన్ ట్రైబల్స్ తోటి లోపాయకరా ఒప్పందం ఏమైనా చేసుకున్నారా అని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాలను కాపాడటానికి అధికారులు ఇటువంటి కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పెట్టిన దరఖాస్తుకు జవాబుదారి తన వహించని తాసిల్దార్ పై చర్యలు కోరుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
