పయనించే సూర్యుడు న్యూస్ (ఫిబ్రవరి.28/02/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వరదయ్యపాలెం మండలం నెల్లాటూరు పంచాయతి కి చెందిన తెలుగుదేశం పార్టీ నేత బి శివకుమార్ పంది అడ్డు వచ్చి రోడ్డు ప్రమాదంలో కింద పడి తలకు గాయము అయి శ్రీకాళహస్తిలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఫోన్ లో మాట్లాడి శ్రీకాళహస్తిలోని ఎంజీఎం ఆసుపత్రికి చేర్చుకోమని చెప్పిన ప్రకారం అతనికి ఎలాగ ఉందో అని శుక్రవారం ఆయన ఆరోగ్యం సైతం కాలుకి దెబ్బ తగిలిన హాస్పిటల్ కు చేరుకొని దళిత నేత శివకుమార్ ను పరామర్శించారు.
అతని ఆరోగ్య పరిస్థితిని అక్కడే ఉన్న వైద్యులను అడిగి తెలుసుకున్నారు.శివకుమార్ త్వరగా కోలుకోవడానికి అవసరమైన అన్ని రకాల చికిత్సలను చేపట్టాలని వైద్యులకు సత్యవేడు ఎమ్మెల్యే సూచించారు. శివకుమార్ త్వరగా కోలుకుంటారని, మళ్లీ ప్రజల మధ్యకు వస్తారని, కుటుంబ సభ్యులు అంత వరకు మనో ధైర్యంతో ఉంటానని ఎమ్మెల్యే భరోసా కల్పించారు.అంతే కాకుండా ఎంఎల్ఏ కాలుకి గాయం చూసిన వైద్యులు ఆయనకు ప్రథమ చికిత్స చేసి కట్టు కట్టారు ఆయన ఆపదలో ఉన్నవారిని పేదల పెన్నిధి నిండు మనసున్న మారాజు అని బాధితులు ధన్యవాదాలు తెలిపారు…ఈ కార్యక్రమంలో వరదయ్యపాలెం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.