సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్)
పేద, ధనిక అనే తేడా లేకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకొచ్చిందని షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు.పేద,ధనిక అనే తేడా లేకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకొచ్చిందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు అన్నారు. బుధవారం ఫరూఖ్ నగర్ మండలంలోని చించోడ్ గ్రామంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో మొదటి సారిగా ప్రారంభించారన్నారు. పేద, ధనిక అనే భేదాలు లేకుండా అందరికీ ఒకే రకమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేసిందన్నారు. అదేవిధంగా ఎస్సీ సబ్ ప్లాన్ లో భాగంగా సీ.ఆర్.ఆర్ నిధుల ద్వారా మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు (10.0 లక్షలు) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజు గౌడ్,సూర్య ప్రకాష్, రేకల శ్రీనివాస్ ,అక్కి గారి అనంతం, బాబా,శ్రీధర్ రెడ్డి ,జమాల్పూర్ రాజు ,యాదయ్య ,రఘురాం ,సర్దార్ హాజీ, అక్బర్, ప్రసాద్ ,రాజేందర్ రెడ్డి, తుపాకుల శేఖర్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.