
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 4 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్ నగర్ ఈ బ్లాక్ దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కట్ట మైసమ్మ దేవాలయంలో ఆషాఢ మాస బోనాల పండుగ మహోత్సవం భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు, స్థానిక ప్రజలకు, మహిళలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి కృపాకటాక్షాలు ప్రతి ఇంటిపై ఉండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మరియు కాలనీ పెద్దలు మాట్లాడుతూ, సఫ్దర్ నగర్ ఈ బ్లాక్ కాలనీతో పాటు శ్రీ కట్ట మైసమ్మ దేవాలయ అభివృద్ధికి తగిన సహకారం అందించాలని వడ్డేపల్లి రాజేశ్వరరావు ని కోరారు. తమ ప్రాంత అభివృద్ధిని ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోవడం లేదని, రోడ్లు, మౌలిక వసతులు, దేవాలయ అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.దీనికి స్పందించిన వడ్డేపల్లి రాజేశ్వరరావు కాలనీ ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ఆలయంతో పాటు కాలనీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.