ఖాళీ కుర్చీ దర్శనమిస్తున్న దృశ్యం…
రుద్రూర్, ఏప్రిల్ 21(పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిడిఓ సమయపాలన పాటించడం లేదని వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. సమయం 11:00 గంటలు దాటినా కూడా కార్యాలయానికి రాకపోవడంతో ఖాళీ కుర్చీ దర్శనమిస్తుంది. కార్యాలయానికి పనుల కోసం వచ్చిన ప్రజలు వేచి చూసి చూసి విసుగ్గు చెంది వెనుతిరుగుతున్నారు. అదేవిధంగా కార్యాలయంలో అధికారి లేకున్నా కూడా ఫ్యాన్ లు, లైట్లు వెలుగుతున్నాయి. దింతో విద్యుత్ ను వృధా చేస్తున్నారని పలువురు నివ్వేరపోతున్నారు.