
పయనించే సూర్యుడు అక్టోబర్ 31 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు మండల పరిధిలోని తిమ్మారావుపేట ఎస్టి హాస్టల్ ను మండల తహసీల్దార్ శేషగిరిరావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా హాస్టల్ లో ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు అందుతున్న మెనూను పరిశీలించారు. హాస్టల్ లో ఉన్న సమస్యలను ఇన్చార్జి హాస్టల్ వార్డెన్ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం హాస్టల్లో ఉన్న ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదని, ఆర్వో ప్లాంట్ మరమ్మతులకు చేయడం కోసం ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది అన్నారు. హాస్టల్ లో పలు సమస్యలను తహసీల్దార్ శేషగిరిరావు తెలుసుకొని ఉన్నతాధికారులకు నివేదిక పంపడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు గిరిజన విద్యార్థుల సంక్షేమ కోసం ఖర్చు చేస్తున్నప్పటికీ, గిరిజన హాస్టల్ లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఆందోళన ఉన్నట్లు తయారయ్యాయని ప్రభుత్వం ఇప్పటికైనా సంబంధిత అధికారులు గిరిజన హాస్టల్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.