పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ధర్నా నిర్వహించారు. తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని సమాన పనికి సమాన వేతనం అందించాలని తమకు రావలసిన బకాయిలను అందించాలంటూ నినాదాలు చేశారు. గత ఎన్నికల్లో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేకుంటే తాము సమ్మెకు వెళ్తామంటూ వీరు తెలిపారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ కు అందించారు.సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు మున్సిపల్ కార్మికుల గౌరవ అధ్యక్షులు డేవిడ్ రాజు, కార్యదర్శి జి.నాగేంద్, ఉపాధ్యక్షులు ఎస్ డి.రిజ్వాన్, కార్మిక నేతలు జి గురవయ్య, జి రుబిన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు