1970 మరికాల జెడ్ లో ఉన్న సర్వే నెంబర్లను మాయం.
పయనించే సూర్యుడు: మార్చి 27: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి. ఎ.
నూగూరు వెంకటాపురం: సమాచార హక్కు చట్టం సెకండ్ ఆపిల్ వెళ్తున్న జి ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి సమాచార హక్కు2005 చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పూనెం సాయి డిమాండ్ చేశారు.గురువారం నాడు పాత్రికేయుల ముఖాముఖి సమావేశంలో జి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి మాట్లాడుతూ వెంకటాపురం మండలం రెవిన్యూ గ్రామమైన మరికల (జెడ్) గల కొన్ని సర్వే నెంబర్ లపై ఫిబ్రవరి 27న సమాచారం హక్కు 2005 చట్ట ప్రకారంగా 1970 నుండి నేటి వరకు సమాచారం హక్కు ద్వారా అడుగుతే 2011 నుండి రికార్డు ఉన్నాయని చెప్పడం విడ్డూరమని ఎద్దేవా చేశారు.రెవిన్యూ కార్యాలయంలో 1970 రికార్డు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. అదే సర్వే నెంబర్లు గతంలో ప్రభుత్వ భూమి అయినప్పటికీ ప్రస్తుత కాలంలో అది ఒక గిరిజనేతరుడి కబంధ హస్తాలలో ఉందని ఆరోపించారు.ఏజెన్సీ ప్రాంతంలో 1970 నుండి రెవిన్యూ రికార్డు ఏమైందని ఆయన మండిపడ్డారు. దీనిపై గొండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సెకండ్ అప్లికు వెళ్తామని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన అన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించిన సంబంధిత రెవెన్యూ అధికారుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సమాచార హక్కు చట్టాన్ని కూని చేస్తూ గిరిజననేతర్లకు అక్రమ పట్టాలు చేస్తూ అధికారులకు డబ్బుల వసూలుకు పాల్పడుతున్నారని ఆరోపించారు.మరికాల జెడ్ అక్రమ పట్టాలపై త్వరలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మీడియా ముఖంగా తెలిపారు.