మాజీమంత్రి జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం నియంత పాలనకు నిదర్శనం
కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును నివసిస్తూ షాద్ నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు
( పయనించే సూర్యుడు మార్చ్ 14 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
కాంగ్రెస్ ప్రభుత్వం పని తీరు నియంత పాలను తలపిస్తుందని, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీలో లేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సభ నుంచి ఆ ఎమ్మెల్యేలను బయటకు పంపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం షాద్ నగర్ పట్టణ ముఖ్య కూడలిలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసిన అనంతరం బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ పనితీరును విమర్శించారు. ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని, అబద్దాలను ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. విఫలమైన ప్రభుత్వ పనితీరును ప్రజలకు తెలిపాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బడ్జెట్ సమావేశాలలో వాళ్లు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంటే సమాధానం చెప్పలేక ఆ సభ్యులను సభ నుంచి బయటకు పంపేందుకు చర్యలు తీసుకోవడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వ పనితీరు మారకుంటే ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నే కవిత నారాయణ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎం.ఎస్. నటరాజన్, మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, నాయకులు వీరేశం గుప్తా, వెంకట్రాంరెడ్డి, పిల్లి శేఖర్, సుధీర్, జూపల్లి శంకర్, పాపయ్య యాదవ్, భిక్షపతి, రాఘవేందర్, గుండు అశోక్, ఉమాప్రసాద్, హరి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.