
పయనించే సూర్యుడు డిసెంబర్ 30 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎంతో ప్రతిష్టంగా గొప్పగా సర్కార్ బడులు ను తీర్చిదిద్దుతున్నామని పేరు గొప్ప ఊరు దిబ్బ లాగా సూళ్లూరుపేట నడిబొడ్డున ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో దీనస్థితి కన్నెత్తి చూడని పాలకులారా పేద బిడ్డలు పడుతున్న బాధలు మీ కంటికి కనిపించడం లేదా ఏం చేస్తుందో సర్కార్ అర్థం కావడం లేదు గవర్నమెంట్ స్కూల్లో ర్యాంకులు రావాలంటే ఎలా వస్తాయి గవర్నమెంట్ స్కూల్ కి చుట్టుపక్కల ఎలాంటి వాతావరణం ఉందో మీకు కనిపించట్లేదా ఎక్కడ చూసినా దోమలు ఎక్కడ చూసినా మురికి కాలువలు అదే ప్రైవేట్ స్కూల్ అయితే శుభ్రత పాటిస్తారు ఆ శుభ్రత ఎందుకు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో పాటించట్లేదు ఎందుకంటే లక్షల్లో ఫీజు కడుతున్నారు కాబట్టి అక్కడ శుభ్రంగా ఉంటాయి రెక్కాడితే కానీ డొక్కాడని కూలీల పిల్లల చదివే స్కూల్లో ఇలా ఉంటాయని స్టాంప్ వేసేసారు మున్సిపల్ కమిషనర్ బస్టాండ్ దగ్గర ఉన్న గవర్నమెంట్ పాఠశాల దగ్గరికి ఒకసారి వీలుంటే వెళ్లి చూడండి ఎంత దీనస్థితిలో పిల్లలు ఉన్నారో ఒకసారి అర్థం అవుతది అక్కడే తాగుతున్నారు అక్కడే ఉంటున్నారు పిల్లలకి ఆరోగ్యం పాడైపోతే ఎవరు దాని తిరిగి తీసుకొచ్చేది గవర్నమెంట్ మంచి భోజనం మంచి బట్టలు మంచి చదువు చెప్పిస్తామని పిల్లలకి కావలసిన అన్ని వసతుల సమకూర్చమని ఆర్డర్ పాస్ చేస్తుంటే కనీసం ఒక్కసారి కూడా కన్నెత్తి చూడని ప్రభుత్వ ఆఫీసర్లు ఓ ప్రభుత్వ ఉద్యోగుల రా పిల్లలకి మంచి చదువు మంచి బట్ట మంచి ఆరోగ్యం ఇస్తే గవర్నమెంట్ స్కూల్లో కూడా 100% ర్యాంకులు వస్తాయి అలాకాకుండా మనకెందుకులే అనుకుంటే పిల్లల ఆరోగ్యం పాడైపోతది ఇకనైనా సంబంధిత అధికారులు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడండి మహా ప్రభువు