హాజరైన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
( పయనించే సూర్యుడు ఆగస్టు 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఈ రోజు హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.