
{ పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి11 }
నారాయణ పేట మండలం లోకపల్లి సర్పంచ్ శేఖర్ గౌడ్ ను బిజ్వార్ కు వచ్చిన సందర్భంగా గ్రామస్థులు ఘనంగా శాలువాతో సన్మానం చేసి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. బిజ్వార్ గ్రామ ఆడపడుచు భర్త సర్పంచ్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఐదు సంవత్సరాలలో గ్రామాన్ని ఆదర్శ గ్రామం గా అభివృద్ధి చేయాలని తెలిపారు.అట్టడుగు వారికి సంక్షేమ పథకాలు అందేవిధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్. నర్సింహా,మహేష్ గౌడ్,సువర్ణ,ఆనంద్ గౌడ్, చెన్నారెడ్డి,అశోక్,రమేష్,తులసీదాస్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.