
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా భోస్లే పండిత్ రావు పటేల్ ఎన్నుకున్నారు. ఈ సమావేశాన్ని హైదరాబాద్‌లో లక్డీకాపూల్‌లోని వేంకటేశ్వర ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర పంచాయితీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గానికి చెందిన ప్రజానాయకుడిగా, ప్రజల సమస్యలపైన ఎప్పుడూ ముందుండే నాయకుడిగా భోస్లే పండిత్ రావు పటేల్‌కు మంచి పేరు ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో కూడా ఆయన చురుకుగా పనిచేసి, ముధోల్ నియోజకవర్గంలో ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ బలోపేతం, సర్పంచ్‌లకు న్యాయం చేయడం ప్రధాన లక్ష్యాలుగా పనిచేస్తానని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం–సంఘం మధ్య సమన్వయం పెంచేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.ఈ సందర్బంగా సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికతో రాష్ట్రంలోని సర్పంచ్‌లకు మరింత బలమైన స్వరంగా పనిచేస్తారని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. పండిత్ రావు పటేల్‌ను ఇదివరకే భైంసా మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.