
కడియాల కుంట తండా సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ ను అభినందించిన ఎంఈఓ మనోహర్
ప్రారంభోత్సవానికి హాజరైన మండల విద్యాధికారి మనోహర్
( పయనించే సూర్యుడు జూన్ 17 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని తిమ్మాజి పల్లి తండాలో గత సంవత్సరం మూతపడిన ప్రభుత్వ పాఠశాలను కడియాల కుంట తండా సర్పంచ్ రాజు నాయక్ చౌహన్ ప్రత్యేక కృషితో మంగళవారం తిరిగి ఉన్న ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ఫరూక్నగర్ మండల విద్యాధికారి మనోహర్ ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థుల చేత సామూహిక అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. పూర్తిగా మూతపడిన పాఠశాలను 13 మంది విద్యార్థులతో ఉన్న ప్రారంభించడానికి ఎంతో కృషిచేసిన సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ కు ఎంఈఓ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సర్పంచ్ రాజు నాయక్ మాట్లాడుతూ… విద్యా అనేది ఎంత శక్తివంతమైనదో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యతోనే ఏదైనా సాధ్యమవుతుందని ఉన్నారు. ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించే గల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మనోహర్ మరియు సర్పంచ్ రాజు నాయక్ చౌహన్, ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి,వార్డు నెంబర్ నీలా భాస్కర్ నాయక్ మరియు చందు నాయక్ గ్రామ పెద్దలు మహిళలు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.