అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్
సుబ్రహ్మణ్యే్శ్వర స్వామికి ప్రత్యేక పూజలు
అన్న సంతర్పణకు చేయూత ..
పయనించే సూర్యుడు బాపట్ల జనవరి 17:- రిపోర్టర్ (కే శివ కృష్ణ )... సర్వమానవాళి సేవ భగవంతుని సేవతో సమానమని అఖండ ఫౌండేషన్ అధ్యక్షుడు విన్నకోట సురేష్ అన్నారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పెదపులుగువారి పాలెంలో శ్రీ వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాపట్ల అఖండ పౌండేషన్ అధ్యక్షుడు విన్నకోట సురేష్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులతో కలిసి అన్న సంతర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా విన్నకోట సురేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు విన్నకోట సురేష్‌కు స్వామి వారి చిత్రపటాన్ని అందజేసి పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో అఖండ ఫౌండేషన్ సభ్యులు గోపాలం లక్ష్మీనారాయణ, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గుంటుపల్లి తులసి కుమారి, సీనియర్ నాయకులు కారుమూరి అంజనేష్, కర్లపాలెం మండల అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ, మండల ఉపాధ్యక్షులు చిలకల సురేంద్రబాబు, అంకిరెడ్డి అనూష్ కుమార్, రామారావు, రాధాకృష్ణ, గంగరాజు, తాతారావుఅంకిరెడ్డి దానయ్య తదితరులు పాల్గొన్నారు.