
రుద్రూర్, డిసెంబర్ 30 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
: రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత అధ్యక్షతన అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు , నిజామాబాద్ జిల్లా ఇంఛార్జ్ దనసరి అనసూయ సీతక్కకు, రాష్ట్ర ఆరు గ్యారెంటీలు అమలు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్ కి, బాన్సువాడ శాసనసభ్యులు ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి నూతన పాలకవర్గం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సర్పంచ్ ఇందూరు సునీత మాట్లాడుతూ.. గత బీఆర్ ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నాలుగు గోడల మధ్యలో చేసిన తప్పుడు సర్వేలు కాకుండా ప్రస్తుత పాలకవర్గం, గ్రామ పెద్దల సమక్షంలో అధికారులతో సమగ్ర సర్వే నిర్వహించి, ఆ సర్వేను గ్రామసభలో ప్రవేశపెట్టి, అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ సమక్షంలో నిరుపేదలైన లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ లు పంపణి చేయాలనీ తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ ప్రేమ్ దాస్, ఉప సర్పంచ్ నిస్సర్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.