స్వామివారి ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు
పయనించే సూర్యుడు, జనవరి 10 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక లోని సాకేతపురి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా సాకేతపురి ఆంజనేయ స్వామి సేవా సమితి , సాకేతపురి హనుమాన్ చాలీసా భక్త బృందం వారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు హనుమాన్ చాలీసా మండల పారాయణం 41 రోజు పూర్తయిన సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 4:30 నుండి స్వామివారికి అభిషేకము , వస్త్రాలంకరణ, అష్టోత్రము, ఆకుపూజ 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ నవంబర్ 29వ తారీఖున సాకేతపురి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రారంభమైన హనుమాన్ చాలీసా మండల పారాయణం కార్యక్రమం ప్రతిరోజు భక్తుల గృహములలో మరియు ఆలయాలలో నిర్వహించి 41 రోజులు పూర్తిచేసుకుని ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్నారు ఈ సందర్భంగా రకరకాల పూలతో ఎంతో సుందరంగా ఆలయాన్ని భక్తులు అలంకరించారు. స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో సాకేతపురి ఆంజనేయ స్వామి సేవా సమితి సాకేతపురి హనుమాన్ చాలీసా భక్త బృందం మరియు అధిక సంఖ్యలో భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు