పయనించే సూర్యుడు న్యూస్ మే 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎలాంటి నోటీసులు లేకుండా "సాక్షి" దినపత్రిక ఎడిటర్ ఆర్. ధనుంజయ్ రెడ్డి ఇంటికి వెళ్లి సోదాలు చేయడాన్ని తెలంగాణ జర్నలిస్టుల సంఘం నాయకులు ఖండించారు. కెపిహెచ్బి కాలనీలోని మహాత్మ గాంధీ విగ్రహం వద్ద శనివారం జర్నలిస్ట్ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజ్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, అందుకు సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి పై అక్రమ సోధాలు చేయడమే అని అన్నారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ప్రభుత్వాలే బాధ్యతగా ఉండాలని, కక్షపూరితంగా దాడి చేయడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం తీరుకు ప్రజలను, జర్నలిస్ట్ లను చైతన్యపరిచి మరో ఉద్యమం చేసి జర్నలిస్టుల సంఘాల హక్కులను కాపాడుకుంటామని ఐ జేయు నాయకుడు, ప్రజా ఆలోచన వేదిక అధ్యక్షుడు విద్యా వెంకట్ అన్నారు.ప్రశ్నించే గొంతును నొక్కి పెట్టేస్తారా.ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును నొక్కి పెట్టేస్తారా అని సాక్షి దినపత్రిక కూకట్ పల్లి జోన్ ఇంచార్జీ పరమేశ్ అన్నారు. ఇసుక, లిక్కర్, మైనింగ్, స్కాం లు, రైతులకు మద్దతు ధర కల్పించకపోవడం ఇలా ప్రభుత్వ వరుస వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షి గొంతు నొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు లేకుండా పోలీసులు ఇంట్లోకి చొరబడి సోదాలు చేయడం, భయపెట్టడం సాక్షి గొంతు నొక్కే ప్రయత్నం అని అన్నారు.రాజకీయ కక్ష సాధింపు లో జర్నలిస్టుల ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం.ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉందని దానిని నొక్కిపెట్టకూడదని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జర్నలిస్టుల ఇంటిపై పోలీసులు వెళ్లడం ఖండిస్తున్నామని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని, లేదంటే విద్యార్థి సంఘాలు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం జర్నలిస్టు నాయకులు ఆర్ కె. దయ సాగర్, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాణిక్ రెడ్డి, రాహుల్, నాగరాజు, ప్రవీణ్, జై కుమార్ , సాగర్ రెడ్డి, రాము, నవీన్, రమేష్, రాకేష్, శ్రీనివాస్ రెడ్డి కుల్ల రాజు, నరసింహ రావు, వెంకటేష్, రామారావు, హరి కృష్ణ, మారుతి సాగర్, పలు పార్టీ ల నాయకులు ఐస్ క్రీమ్ వెంకట్ రెడ్డి, శివా రెడ్డి, జొన్నల శ్రీనివాస్ రెడ్డి, వెంకటస్వామి రెడ్డి, విద్యార్థి సంఘాల నాయకులు దిలీఫ్, అశోక్ గౌడ్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.