గుండెపోటుతో సాక్షి రిపోర్టర్ శేఖర్ మృతి.
పయనించే సూర్యుడు జనవరి 18 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్త విశ్లేషణ. గంపలగూడెం మండల సాక్షి దినపత్రిక (విలేఖరి) రిపోర్టర్ తాటికొండ చంద్రశేఖర్ (57) గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు. శుక్రవారం సాయంత్రం చాతిలో నొప్పి వస్తుందంటూ, బాత్రూం కి వెళ్లి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బయటకు వచ్చి కుర్చీలో కూర్చొని కొప్పకూలినట్లు వివరించారు. ఆత్రుతతో స్థానిక ఆసుపత్రికి తీసుకురాక అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.