పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా లో
రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హంధాన్
సందర్భంగా జిల్లా మరియు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హమ్దాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నుడా చైర్మన్ కేశ వేణు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్ హంధాన్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే సమాజంలో అంటరానితనానికి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి అని, కుల వ్యవస్థను నిర్మూలించి అందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లారని, అదేవిధంగా మహిళలకు విద్యలో ప్రాధాన్యం కల్పించి సమాజంలో మహిళలకు హక్కులు కల్పించే విధంగా జ్యోతిరావు పూలే ఆయన భార్య సావిత్రిబాయి పూలే కృషి చేయడం జరిగిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడుతూనే ఉంటుందని ,రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి అందులో భాగంగా బీసీ కులగణన చేసి అన్ని వర్గాలకు జనాభాను తగ్గట్టు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పెంచడం జరిగింది అని ఆయన అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ అణగారిన వర్గాలను ఏకం చేస్తూ వారికి హక్కులను కల్పిస్తూ వారి పక్షాన నిలుస్తూ ముందుకు వెళుతున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సామాజిక సంస్కర్తగా సమాజంలో అంటరానితనాన్ని కుల వ్యవస్థను నిర్మూలించే విధంగా కృషి చేశారని, అందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా పోరాడిన వ్యక్తి అని ఆయన అన్నారు. అదేవిధంగా మహిళలకు విద్యను కల్పించి సమాజంలో కుటుంబంలో వారి ప్రాధాన్యతని పెంచిన గొప్ప వ్యక్తి అని మరొకసారి జ్యోతిరావు పూలే కి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిసిసి డెలికేట్ శేఖర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతా రెడ్డి రాజారెడ్డి ,రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, పోల ఉష ,ఎస్సీ సెల్ వినయ్ లవంగ ప్రమోద్, మహేందర్, శోభన్ ,ఆడె ప్రవీణ్, నరేందర్ సింగ్ మరియు తదితరులు పాల్గొన్నారు.