పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 3, ఆదోని రిపోర్టర్ గుమ్మల బాలస్వామి.
ఇవాళ బిజెపి పార్టీ కార్యాలయంలో నిన్నటి రోజున వైసీపీ నాయకులు బిజెపి నాయకులపై మాట్లాడిన విషయాలను పరిగణంలోకి తీసుకొని బిజెపి కౌన్సిలర్ లలితమ్మ, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి ఆదూరి విజయ్ కృష్ణ, మధుసూదన్ శర్మ మాట్లాడుతూ వైసిపి నాయకులు చెప్పిన విధంగా మా కౌన్సిలర్లు రాజీనామాకు సిద్ధమని, యునానమస్ గా గెలిచిన మీ వైసీపీ కౌన్సిలర్లు ఏ రోజు రాజీనామా చేస్తారో మీరే డేట్ ఫిక్స్ చేసి చెప్పాలని అన్నారు. అదే రోజున, అదే సమయానికి మా కౌన్సిలర్లు రాజీనామా చేయడానికి సిద్ధమని వైసిపి పార్టీ నాయకులకు, సాయి ప్రసాద్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇప్పటికే మా వద్దకు వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో కబ్జాకు గురైన బాధితులు మా వద్ద కొచ్చి న్యాయం చేయాలని కోరారు, త్వరలో వారికి కూడా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బాధితులకు న్యాయం చేస్తామని, ఆదోని శాసనసభ్యులు పార్థసారధి గారు 8 నెలల్లోనే ఆదోనిలో జరిగిన అభివృద్ధి విషయాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సురేష్, రమాకాంత్, శ్రీనివాస్ ఆచారి, సాయి ప్రసాద్ వాల్మీకి, మల్లిక, వీరేష్ వాల్మీకి, రవి, అంజయ్, శ్రీకాంత్, లక్ష్మీనారాయణ, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.