--- ఉపాధ్యాయులను సన్మానించిన ఎంఈఓ రాజీ మంజుష.
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 15 నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలో సాలూర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి రాజీ మంజూష అధ్యక్షత వహించగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మండలంలోని 8 మంది ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు.పిఎల్ఎం మేళాలో ప్రతిభా కనబర్చిన ఉపాధ్యాయులకు ప్రశంస పత్రాలను అందించి సత్కరించారు.ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సేవలు చిరస్థాయిగా గుర్తించుకునేవని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రుల తరువాత విద్యార్థులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని కొనియాడారు. విద్యాశాఖ అధికారి రాజీ మంజూష మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపు దిద్దుకుంటుందని అభివర్ణించారు. కాబట్టి విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సాయిలు, లక్ష్మణ్, కృష్ణారెడ్డి, అరుణ్, విఠల్ కాంబ్లే,వివిద పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.