మామూళ్ల మత్తులో స్థానిక పోలీస్ యంత్రాంగం?
స్థానిక పోలీసులు దాడులు నిర్వహించకపోవడంపై ప్రజల అనుమానాలు
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 25 నిజామాబాద్ జిల్లా
బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండల కేంద్రంలో సాలుర గ్రామ
శివారులో పేకాట స్థావరాలపై జిల్లా సిసిఎస్ పోలీసులు ఆదివారం మెరుపు దాడులు చేశారు.పట్టుకున్న వారిని బోధన్ రూరల్ పోలీసులకు అప్పగించారు.బోధన్ రూరల్ ఠాణా ఎస్ఐ మచ్చెందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నలుగురిని పట్టుకున్నారు.ఐదుగురు పరారయ్యారు.వారి వద్ద నుంచి 1200 నగదు,ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.బోధన్ ప్రాంతంలో పేకాట స్థావరాలు నిర్వహిస్తున్న సమాచారం జిల్లా పోలీస్ యంత్రాంగం కుపీ లాగి దాడులు నిర్వహిస్తున్నారు.స్థానిక పోలీస్ యంత్రాంగానికి సమాచారం ఉన్నప్పటికీ పేకాట స్థావరాలపై దాడులు ఎందుకు నిర్వహించడం లేదని ప్రజలలో అనుమానాలు వెలువెత్తుతున్నాయి.పేకాట స్థావరాల నిర్వహణ వెనుక బోధన్ రూరల్ ఠాణా కొందరు పోలీసుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు లేకపోలేదు.వందలు వేలు కాదు లక్షల్లో చేతులు మారుతున్నట్లు అనుమానితులు గుసగుసలు పెడుతున్నారు.ఏది ఏమైనాప్పటికీ పేకాట స్థావరాల నిర్వాహకులు ఇటు పోలీసులు భారీ మొత్తంలో వారి వారి ఖజానాను నింపుకుంటున్నారు అన్న విమర్శలు ఉన్నాయి.అందుకొరకే స్థానిక పోలీసులు నిషేధిత వ్యవహారాలపై దాడులు చేయకుండా కళ్ళు మూసుకునే ధోరణిలో స్థానిక పోలీసుల తీరుకు అద్దం పడుతుంది.ఈ విషయాలపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి నిషేధిత వ్యవహారాలకు సహకరిస్తున్న పోలీస్ అధికారులు,సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.