
కాంపాటి పృథ్వీ,పి.డిఎస్ యూ, రాష్ట్ర అధ్యక్షులు
పయనించే సూర్యుడు జనవరి 3 (పొనకంటి ఉపేందర్ రావు)
ఇల్లందు:ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పిడిఎస్ యూ), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇల్లందు ప్రభుత్వం జూనియర్ కళాశాలలో విప్లవ క్రాంతికారిణి సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. తొలుత రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృద్వి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పిడిఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వి, జిల్లా అధ్యక్షులు బి వీరభద్రం మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే దక్షిణ మహారాష్ట్రలో జనవరి 3వ తేదీన సాతా అనే జిల్లాలో నాయగావ్ అనే ఓ మారుమూల గ్రామంలో జన్మించిందన్నారు. సావిత్రిబాయి పూలేకి బాల్యంలోనే సమాజ సేవ, నాయకత్వ లక్షణాలు, పోరాటతత్వం, గాంభీర్యం, ధైర్యం, వీరత్వం మెండుగా ఉండేవన్నారు. ఈ గుణాలే తాను విప్లవ క్రాంతికారిణిగా ఎదగడానికి దోహాదపడ్డాయన్నారు. ఆంగ్లేయుల పరిపాలన దక్షతను చూసి పూలే దంపతులు తమ ప్రజలు కూడా ఆ విధంగాఉన్నతీకరించబడాలన్నారు. సావిత్రిబాయి ఆంగ్ల భాషలో ప్రావీణ్యం పొందడం వల్లే ఆంగ్లేయులు పాలన గురించి, పాలనలోని సామాజిక లోటుపాట్లను అర్థం చేసుకోగలిగారన్నారు. ఆనాడు బ్రాహ్మణులకు, ఆంగ్లేయులకు మధ్య గల సంబంధాన్ని అర్థం చేసుకోగలిగారన్నారు. బ్రాహ్మణులు, ఇతర సవర్ణులు ఉన్నత స్థానాల్లో ఉండడానికి రాజ్యాధికారంగల పాలకవర్గాలతో చేతులు కలపడమే కారణం అన్న రహస్యాన్ని చారిత్రక పరిశోధనల ద్వారా అర్థం చేసుకోగలిగారన్నారు. చిన్నతనం నుండే బాలికల చదువులు కోసం, మహిళల హక్కుల సాధన కోసం పోరాడిందిన్నారు. దేశంలోనే బాలికల చదువు కోసం మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేసి, తొలి మహిళ ఉపాధ్యాయురాలు అయ్యారన్నారు. అన్ని కులాల వారికి సమాన విద్య కోసం, బాలికల కోసం పాఠశాల నిర్వహించే క్రమంలో కష్టాలు ఎన్ని ఎదురైనా తమ విప్లవ కర్తవ్యాన్ని విస్మరించలేదన్నారు. శూద్రులు, అతిశూద్రులు మరియు స్త్రీల జీవితంలో విప్లవాత్మకమైన చైతన్యాన్ని తీసుకువచ్చారన్నారు. 1876-77 కాలంలో మహారాష్ట్రలో తీవ్రమైనకరువుసంభవించినప్పుడు వ్యాపారస్తులు మాత్రం సరుకునంత గోడౌన్లలో దాచిపెట్టి తాళం వేసేనారనీ, అట్టడుగు వర్గాల వారు ఆకలితో అలమటించేవారనీ, దీన్ని చూసి సత్యశోధక్ సమాజ్ అనే సంస్థ ఏర్పాటుచేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారన్నారు, కొన్నిచోట్ల 2000 మంది చిన్నారి పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారన్నారు. తమను స్ఫూర్తిగా తీసుకొని నేటి విద్యార్థులు సమాజ మార్పు కోసం పోరాడాలన్నారు. విద్యారంగంలో వస్తున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ముందుండి కొట్లాడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బి సాయి, శ్రావణి, జిల్లా కమిటీ సభ్యులు పార్ధు, శ్రావణ్, ఎం సాయి, జంపన్న, సిద్దు, రోహిత్, రామ్ చరణ్, జిల్లా నాయకులు తబిత, భార్గవి, తదితరులు పాల్గొన్నారు