
సావిత్రి బాయి పూలే గారి పోరాటం మరువలేనిది
ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్
( పయనించే సూర్యుడు జనవరి 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
జిల్లెడ్ చౌదరిగుడా మండల పరిధిలో చెగిరిరెడ్డి ఘనపూర్ గ్రామ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అప్పల రాజు గారి ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రి పూలే గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం పాఠశాల మహిళ హైమావతి ఉపాధ్యాయులను ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడు ఆకాష్ నాయక్ విద్యార్థులతో సన్మానించారు.వారు మాట్లాడుతూ భారతదేశంలోని అణగారిన, అంటరాని కులాలకు అక్షరాన్ని అందించిన ఘనత సావిత్రి బాయి ఫూలే గారిది అని అన్నారు. వితంతువులు, మహిళల కోసం ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించి సమాజంలోని అసమానతలపై పోరాడిన వీర వనిత అని అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలకు అందించడానికి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని, విద్యను అందించడం కోసం పోరాటమే చేయాల్సి వచ్చిందని అన్నారు.మనమందరం సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించాలని విద్యార్థులను నేటి సమాజానికి కోరారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఏఐఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు