రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకుబ్ షావలి టేకులపల్లి కార్యదర్శి జరుపుల సుందర్ పిలుపు
పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి పోనకంటి ఉపేందర్ రావు
టేకులపల్లి ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, టియుసిఐ
అనుబంధ రాష్ట్ర రెండవ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు టేకులపల్లి మండలంలోని సింగరేణి కేఓసి, హైటెక్ కాలనీలో కాంట్రాక్ట్, కార్మికుల సమావేశం టేకులపల్లి ఏరియా కార్యదర్శి జరుపుల సుందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంగం రాష్ట్ర అధ్యక్షులు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు.
కార్మికులు దుమ్మిలో ధూళిలో పనిచేస్తున్న గాని నామమాత్రపు వేతనాలతో పని చేయించుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 14 నెలలు గడిచిన జీతాలు పెంచకపోవడం బాధాకరమని అన్నారు. ఈనెల 31న పోరాటాల పురిటిగడ్డ ఇల్లందులో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల రాష్ట్ర రెండవ మహాసభ ఎల్లన్న భవనంలో జరుగుతుందన్నారు. ఈ మహాసభను జయప్రదం చేయాలని సింగరేణికంట టు కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మోటర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పాయం వెంకన్న, టియుసిఐ టేకులపల్లి మండలం ఏరియా నాయకులు షఫీ, సైదులు రవి మంగ్య, శివయ్య రామారావు బాలు వీసం నరేష్ బాబు, నాగమణి ఎర్రమ్మ, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.