పయనించే సూర్యుడు ఫిబ్రవరి 2 బచ్చన్నపేట ప్రతినిధి జనగామ జిల్లా. ఎట్టకేలకు సిద్దుల గుట్ట పొడవుటూరు శ్రీ సిద్దేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి ఎన్నిక జరిగింది. చైర్మన్గా రామచంద్ర పురానికి చెందిన ఆముదాల మల్లారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్టిలో ఉంచుకొని ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా పాలకమండలికి శాలువాలతో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అభినందనలు తెలిపారు. పాలకమండలిలో సూత్రమే రామకృష్ణ వల్లాల సత్యనారాయణ, పెలిమెల్లి వెంకటేష్, మంతపురి రాములు, ఇమ్మడి తిరుమలరెడ్డి కాశిరెడ్డి శ్రీనివాస్,నిమ్మ కరుణాకర్ రెడ్డి, శివరాములు,రావుల బిక్షపతి కేసరి రమేష్,బాల భాస్కర్,నేరెళ్ల రాజేష్ ఉన్నారు. కార్యక్రమంలో నాయకులు విద్యానాథ్ అల్వాల ఎల్లయ్య దిడిగా రమేష్ మసూద్ గంగం బుచ్చిరెడ్డి గిద్దల రమేష్ మచ్చ సందీప్ జిల్లా సందీప్ వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.