పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
గత 18 రోజులుగా సాగుతున్న సినీ కార్మికుల సమ్మెకు శుభం కార్డు పడింది. ముప్పై శాతం వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికుల ఫెడరేషన్ ఈనెల నాలుగో తారీఖు నుంచి సమ్మెకు దిగడంతో గత 18 రోజులుగా టాలీవుడ్లో అన్ని సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌ల షఉటింగ్ నిలిచిపోయింది. అనేకసార్లు నిర్మాతలకు, ఫెడరేషన్‌కు మధ్య చర్చలు జరిగినప్పటికీ అవేవీ కూడా సమస్యను పరిష్కరించలేక పోయాయి. ఈ వివాదంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు జోక్యం చేసుకున్నా సమస్య వెంటనే కొలిక్కి రాలేదు. ఎఫ్డిసి చైర్మన్, ఫిలిం ఛాంబర్ అధ్యక్షుని చొరవతో తెలంగాణ ప్రభుత్వం ఈ వివాదంలో జోక్యం చేసుకోవడంతో సమస్య కొలిక్కి వచ్చింది. ప్రభుత్వ జోక్యంతో లేబర్ కమిషన్ ప్రొడ్యూసర్లకు, ఫెడరేషన్‌కు మధ్యవర్తత్వం వహించడంతో రాత్రి పది గంటల తర్వాత చర్చలు సఫలమయ్యాయి. సినీ కార్మికుల పోరాటం ఫలించింది. 22.5 శాతం వేతన పెంపునకు నిర్మాతలు, కార్మికుల ఫెడరేషన్ మధ్య అంగీకారం కుదిరింది. అనంతరం తెలంగాణా ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో వివరాలను నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్‌రాజు, కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ వెల్లడించారు. రాబోయే మూడేళ్లలో ముప్పై శాతం వేతన అగ్రిమెంట్ విషయమై కార్మికుల పక్షాన ఫెడరేషన్ పోరాటాన్ని ఈనెల నాలుగో తేదీనుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పోరాటానికి సిఐటియు తెలంగాణా రాష్ట్ర కమిటీ మద్దతు తెలియజేసింది. గురువారంనాడు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి అసిస్టెంట్ కమిషనర్ గంగాధర్ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని కార్యాలయంలో ఇదే విషయమై గురువారం రాత్రి పొద్దుపోయే వరకూ సుదీర్ఘ చర్చలు జరిగాయి. తెలుగు సినీ నిర్మాతల మండలి, కార్మికుల పక్షాన ఫిలిం ఫెడరేషన్ తరపున ఐదుగురేసి ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. మొత్తం నాలుగురౌండ్లలో చర్చలు జరిగాయి. ఐదో రౌండ్లో ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్‌కుమార్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు కులిమిల్లి, కోశాధికారి టి.వి.అలెగ్జాండర్ అలెక్స్‌లను మాత్రమే పిలిచారు. నిర్మాతల మండలి తరపున స్రవంతి రవికిశోర్, సుప్రియ, కె.ఎల్.దామోదర్‌ప్రసాద్, భరత్‌భూషణ్, చెర్రీ, తేజ, ఎస్కెఎన్, ధీరజ్, రాజేష్ దండా, ప్రైమ్ షో చైతన్య, శరత్, అనురాగ్, మధుర శ్రీధర్, మహేశ్వర్ రెడ్డి, రాకేష్ వర్రే తదితరులు పాల్గొన్నారు. ఫెడరేషన్ తరపున తెలుగు సినీ అండ్ టివి మేకప్ ఆర్టిస్ట్స్ అండ్ హెయిర్ స్టయిలిస్ట్ యూనియన్ అధ్యక్షులు జి.గురివిరెడ్డి, కాస్టూమర్స్ యూనియన్ అధ్యక్షులు ఎస్.శ్రీనివాసులు, స్టంట్స్ డైరెక్టర్స్ అండ్ స్టంట్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షులు పిఎన్ బాజీ, డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ యూనియన్ అధ్యక్షులు ఇ.జోసఫ్, డిజిటల్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ అధ్యక్షులు గోగినేని శివరామ్, అవుట్డోర్ యూనిట్ టెక్నీషియన్స్ యూనియన్, అవుట్డోర్ టైట్మెన్ యూనియన్ అధ్యక్షులు కొమ్ముల శ్రీనివాసరావు, డిజిటల్ ప్లాట్ఫారం ప్రొడక్షన్ సెట్ అసిస్టెంట్స్ యూనియన్ అధ్యక్షులు బి.వెంకటకృష్ణ, జూనియర్ ఆర్టిస్ట్స్ ఏజెంట్స్ యూనియన్ అధ్యక్షులు ఆర్.ఆర్.నాయుడు, డిజిటల్ వెబ్ సిరీస్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు బి.సీతారామ్, పబ్లిసిటీ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షులు సిహెచ్.రాంబాబు, జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షులు డాక్టర్ శోభ్‌రాజ్, ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు టి.లలిత, స్టూడియో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎం.వి.వి.కుంతారావు తదితరులు ఈ సమావేశాలకు హాజరయ్యారు.పెంపుదలతో కార్మికులకు న్యాయం తెలుగు సినిమా పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టులు, క్లీనర్లు, ప్రొడక్షన్ బార్సు, డ్రైవర్లు, లైట్ మ్యాన్, సెట్ బోర్సు, ఆర్ట్ అసిస్టెంట్లు, ఫైటర్లు, డ్యాన్సర్లు.. మొత్తం ఇరవై నాలుగు విభాగాల్లో పనిచేసే కార్మికులు ఉన్నారు. సినిమా తెరపై ప్రధానంగా కనిపించే క్యారెక్టర్ల సంఖ్య పదికి మించి ఉండదు. నేపథ్యంలో సహజత్వం కోసం వందలమంది జూనియర్ ఆర్టిస్టులు కనిపిస్తారు. షూటింగ్ సమయంలో టీ, కాఫీలు అందించడం నుంచి మేకప్ మ్యాన్ల వరకు తెరపై కనిపించని వందలమంది కార్మికులుంటారు. వీరంతా రోజువారీ వేతనంపై ఆధారపడి పనిచేసే కూలీలు. జూనియర్ ఆర్టిస్టులు ప్రతిరోజూ షూటింగులు జరిగే ప్రదేశాలకు తరలించబడు తుంటారు. చాలీచాలని వేతనాలతో, గంటల సమయం ప్రయాణాలతో ఇబ్బందు లెదుర్కుంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది కార్మికులు ఉన్నారు. వీరిలో నాగులు వెల మంది జూనియర్ ఆర్టిస్టులే. వీరంతా తెలుగు ఫిల్మ్ ఎంప్లా యీస్ ఫెడరేషన్లో సభ్యులుగా ఉన్నారు. వీరిలో జూనియర్ ఆర్టిస్టులకు రోజుకు రూ. రెండు వేల నుంచి రూ.ముడు వెల మంది మిగిలిన కార్మికులకు రూ. ఎనిమిది వందల నుంచి రూ.1800 వరకూ ఇస్తున్నారు.జూనియర్ ఆర్టిస్టులు : రూ. రెండు వేల నుంచి రూ.ముడు వెల వరకు, ఎలక్ట్రీషియన్, లైట్‌మ్యాన్ ఇన్‌ఛార్జి రూ. 1400, లైట్‌మ్యాన్ రూ. 1161, ప్రొడక్షన్ బారు ఇన్‌ఛార్జి రూ. 1400, ప్రొడక్షన్ బారు రూ. 1127, హెడ్ కార్పెంటర్, పెయింటర్ రూ. 1400, హెడ్ వెల్డర్, పీస్ మోల్డర్ రూ.1400లు మాత్రమే ఇస్తున్నారు. కార్మికుల తపున ప్రాతినిధ్యం వహించే పద ముడు యూనియన్లతో పాటుగా ఇరవై నాలుగు క్రాఫ్ట్‌ల్లో పనిచేసే వారికి వేతన పెంపుదల వర్తిస్తుంది. సుదీర్ఘ చర్చలు తెలంగాణా ప్రభుత్వం ుషనర్ తరపున అసిస్టెంట్ కమిషనర్ గంగాధర్ నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో గురువారం సాయంత్రం సుదీర్ఘంగా జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని లేబర్ కమిషనర్ కార్యాలయంలో నిర్మాతల మండలి నుంచి ఐదుగురు, కార్మికుల పక్షాన ఫెడరేషన్ ప్రతినిధులు ఐదుగురిని ఆహ్వానించారు. కార్మికులు ముప్పై శాతం పెంపుదల కోరగా 22.5 శాతం పెంచేందుకు నిర్మాతల మండలి అంగీకరించగా, తాము సమ్మతమేనని ఫెడరేషన్ నేతలు స్పష్టంచేశారు. దీంతో వివాదానికి తెరపడింది. శుక్రవారం నుంచి షూటింగ్‌లు ప్రారంభమవుతాయని నిర్మాతలు, ఫెడరేషన్ నేతలు ఉమ్మడిగా ప్రకటించారు. తొలుత నిర్మాతల మండలి ప్రతినిధులను లోపలికి ఆహ్వానించిన లేబర్ కమిషన్ అసిస్టెంట్ కమిషనర్ వారి ప్రతిపాదనలు గురించి అడిగి తెలుసుకున్నారు. తొలుత అసంబద్ధమైన వాదనలు కార్మికశాఖ అసిస్టెంట్ కూడా ఫెడరేషన్ నేతలు, కార్మిక సంఘాల నేతల పట్ల కూడా కొంత ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారు. సభ్యత్వాల నమోదు, విరాళాల సేకరణ పుస్తకాలు, ఇతరత్రా నివేదికలు ఇవ్వాలంటూ హుకుం జారీచేశారు. ఆ తర్వాత ఫెడరేషన్ నాయకత్వం లేబర్ కమిషనర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటంతో కాస్త మెత్తపడ్డారు.