పయనించే సూర్యుడు న్యూస్ మక్తల్ జనవరి 20 భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు(CPM)రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా 25 వ తేదీన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గోవింద్ రాజ్ ప్రజలకు పిలుపునిచ్చారు .
సోమవారం మక్తల్ మండల కేంద్రంలోని దాసర్ దొడ్డి గ్రామంలో మహాసభల గోడ పత్రికలను, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం సకల జనుల సంక్షేమ కోసం జరిగే సిపిఎం రాష్ట్ర నాలుగవ మహాసభలను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. అసమానతలు లేని సమాజం కోసం నిరంతరం పోరాడుతూ అణగారిన జాతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ సిపిఎం మాత్రమేనని అన్నారు .
పేద ప్రజలకు నాణ్యమైన విద్య వైద్యం అందాలని, రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని భూమి లేని పేదలందరికీ భూమి పంపిణీ చేయాలని , వారి సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేస్తున్న సిపిఎం పార్టీకి అండగా నిలబడాలని కోరారు . ఈ మహాసభలకు సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకారత్, బీవీ రాఘవులు గారు సహా రాష్ట్ర నాయకత్వం హాజరవుతారని అన్నారు 25 నుండి 28 వరకు 4 రోజుల పాటు మహాసభలు జరుగుతాయని ఈ మహాసభలలో గత పోరాటాలను సమీక్షించి భవిష్యత్ పోరాటాలకు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు.
25వ తేదీన సంగారెడ్డి పట్టణమూలో పీఎస్ఆర్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు.నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం వెంటనే ప్రారంభించాలన్నారు అన్నారు
ఈ బహిరంగ సభకు మక్తల్ మండలంలోని ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాఖ కార్యదర్శి అశోక్, శివప్ప, ఎల్లప్ప, అంజప్ప, శంకరప్ప, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు