పయనించే సూర్యుడు// న్యూస్ ఆగస్టు // మక్తల్ రూరల్
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవ్ పల్లి పాఠశాల ఉపాధ్యాయులు సిపిఎస్ కు వ్యతిరేకంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎస్ లో రద్దుచేసి వెంటనే ఒపీఎస్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విడతల వారిగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నర్సిరెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.