సిపిఐ జిల్లా నాయకులు గుగులోతు రామ్ చందర్
పయనించే సూర్యుడు ఆగష్టు 19 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి మండలం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర 4 వ మహాసభలు ఈనెల 20,21 ,22 మూడు రోజులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గాజుల రామవరం లో జరగనున్నాయని. ఈ మహాసభల జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా నాయకులు గుగులోతు రామ్ చందర్ తెలిపారు. సిపిఐ పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్ లో ఆవిర్భవించిన వందేళ్లు కాలంలో చేసిన పోరాటాలు, త్యాగాలు, వేల కట్టలేని వన్నారు. దేశ స్వసంత్ర పోరాటంలో అనేకమంది కమ్యూనిస్టు నాయకులు కుట్ర కేసులను ఎదుర్కొని జైళ్లలో నిర్బంధించబడ్డారని. ప్రాణ త్యాగాలు చేశారన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమికోసం సామాజిక న్యాయం కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేల మంది కమ్యూనిస్టులు అమరు లైనరన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సిపిఐ మహోజ్వల పాత్ర నిర్వహించిందన్నారు. కార్మిక, కర్షక, యువజన, విద్యార్థి, మహిళా శ్రమజీవుల సమస్యలపై నిరంతరం పోరాడుతుందని. వృత్తి సంఘాలను నిర్మాణం చేసి వారి హక్కుల కోసం నిరంతరం కమ్యూనిస్టు పార్టీ పోరాట ఫలితంగా వందేళ్ళ చరిత్రను ఈ నాలుగవ రాష్ట్ర మహాసభలో జాతీయ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు పాల్గొంటారని రామ్ చందర్ తెలిపారు.