
పయనించే సూర్యుడు డిసెంబర్ 3 (పొనకంటి ఉపేందర్ రావు )ఇల్లందు :
బుధవారంసిపిఐ మండల శాఖ కార్యదర్శి వడ్ల శ్రీను, బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు వడ్డేపల్లి సురేష్ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు స్థానిక శాసనసభ్యులు కోరం కనకయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపాలనకు ఆకర్షితులై అభివృద్ధి బాటలో నడవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వడ్ల శ్రీను, సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, మాజీ ఎంపీటీసీ, డైనమిక్ లీడర్ పూనెం సురేందర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్, ఎట్టి హరికృష్ణ, మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పూనెం మధు, ధనసరి రాజు, గూడెల్లి ఉపేందర్, పాడెం సామ్రాజ్, తదితరులు పాల్గొన్నారు.