
పయనించే సూర్యుడు జనవరి 3,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
18న ఖమ్మంలో జరుగు శతాబ్ది ఉత్సవ ర్యాలీని విజయవంతం చేయండి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు
సిపిఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని, 18న ఖమ్మంలో జరుగు శతాబ్ది ఉత్సవ ర్యాలీని విజయవంతం చేయండని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె. రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు పిలుపునిచ్చారు. నంద్యాల సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు మాట్లాడుతూ ఈనెల 18న ఖమ్మంలో జరుగు శతాబ్ది ఉత్సవ ర్యాలీలో నంద్యాల నుండి అధిక సంఖ్యలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాది సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సిపిఐ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల ఆధ్వర్యంలో దాదాపు 5 లక్షల మందితో ఖమ్మం పట్టణాన్ని ఎర్ర సముద్రంగా మార్చబోతున్నామన్నారు. ఈ సమావేశాలలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా జాతీయ కార్యదర్శులు కె. రామకృష్ణ, వెంకటరెడ్డి,ఉభయ తెలుగు రాష్ట్రాల కార్యదర్శిలు కూనంనేని సాంబశివరావు, జి. ఈశ్వరయ్యలు ముఖ్య అతిధులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. భారత జాతీయ ఉద్యమంలో సిపిఐ సంపూర్ణ స్వాతంత్రం కావాలని తీర్మానం చేయడం జరిగిందని, మీరట్, కాన్పూర్ కుట్ర కేసులను ఎదుర్కొన్న ఘన చరిత్ర సిపిఐదన్నారు. తెలంగాణ నిజాం నవాబుకు వ్యతిరేకంగా భూ పోరాటాలు చేసి దాదాపు నాలుగువేల మంది కమ్యునిస్టు నాయకులు అసువులు భాసారన్నారు. సోషలిస్ట్ సమాజం కావాలనే లక్ష్యసాధనతో సిపిఐ పనిచేస్తుందన్నారు. భూమి లేని నిరుపేదలకు సిపిఐ అండగా ఉండి భూ పోరాటం ద్వారా వారికి భూములను ఇప్పించిన ఘనత చరిత్ర సిపిఐదన్నారు. అమెరికాలోని న్యూయార్క్ నగరానికి మేయర్ గా ఒక సోషలిస్టు భావాలున్న వ్యక్తి గద్దెనెక్కాడని ఆయన గుర్తు చేశారు. బిజెపి మత విద్వేషాలు రెచ్చగొడుతుందని, ఖమ్మంలో జరగబోయే సిపిఐ రెండు రోజుల జాతీయ సమావేశాల్లో వీటిపై చర్చ జరుగుతుందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు బిజెపి కుట్ర పన్నుతుందన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, కార్మికుల 44 చట్టాలను నాలుగు కోడ్ లుగా మార్చి కార్మికులకు అన్యాయం చేస్తుందని బిజెపిని ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం బిజెపి బాటలోనే నడుస్తుందని, అమరావతి రాజధానిగా ఒకే చోట పాలనను కేంద్రీకరించి వేల ఎకరాల భూములను సేకరిస్తుందని ఆరోపించారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాల్లో గ్రామీణ ప్రాంతాలకు మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాలకు రెండు సెట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి 4,00,000 ఆర్థిక సహాయం రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జనవరి 18న జరగబోయే భారీ ర్యాలీలో నంద్యాల నుండి దా దాదాపు వెయ్యి మందితో ర్యాలీగా తరలి వెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని సిపిఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, విశాఖలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకుల మీద రౌడీషీట్లు తెరిచిందని, విద్యార్థులను ఎన్నికల ముందు వాడుకున్న నారా లోకేష్ ఇప్పుడు వారి పైనే కేసులు పెట్టడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసరఫరాల శాఖలో కేజీ చక్కర ఇస్తామని అర కేజీ చెక్కర మాత్రమే ఇస్తున్నారని, బయట మార్కెట్లో అర కేజీ 20 రూపాయలుండగా రేషన్ షాపుల్లో 17 రూపాయలకు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరఫున ప్రభుత్వం నిలదీస్తామని పేర్కొన్నారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబాఫక్రుద్దీన్, సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.వందనములతో కె ప్రసాద్
సిపిఐ పట్టణ కార్యదర్శి నంద్యాల..
