
తంగేలపల్లి గ్రామంలో లబ్ధిదారులకు మండల నాయకుల చేత చెక్కులు అందజేత
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సిఫారసు మేరకు షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండలంలోని సోమారంపాడ్ గ్రామానికి చెందిన బోల యాదయ్య,శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన మేడిపల్లి నవీన్,గంగన్నగూడ గ్రామానికి చెందిన నరసింహారెడ్డి, కొందుర్గ్ గ్రామానికి చెందిన గుండమల్ల జగదీశ్వర్ గౌడ్,అయోధ్యపూర్ తాండ గ్రామానికి చెందిన కేతావత్ సక్రి,వెంకిర్యాల్ గ్రామానికి చెందిన మోత్కూరి చంద్రయ్య,టేకులపల్లి గ్రామానికి చెందిన పత్తి నవీన్ తదితరులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి స్థానిక మండల మరియు ఆయాగ్రామాల నాయకుల చేతుల మీదుగా తంగెలపల్లి గ్రామంలో లబ్ధిదారులకు అందింప చేశారు.ఈ కార్యక్రమంలో కొందుర్గు మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్,మాజీ జెడ్పిటిసి తనయుడు రామకృష్ణ మహాదేవపూర్ సర్పంచ్ అనూష రవీందర్ రెడ్డి,ఉమెంతాల సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్ రెడ్డి,విశ్వనాధ్ పూర్ సర్పంచ్ శ్రీలత రాములు,ఉత్తరాస్ పల్లి సర్పంచ్ నందు,ఉపసర్పంచ్ హలీం బాయ్,మాజీ సర్పంచులు బాల్ రాజ్,గోపాల్ నాయక్,వెంకటేష్,జనార్దన్ గౌడ్, పలువురు మాజీ ప్రజాపప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు జగదీష్ శ్రీశైలంగౌడ్,రవీందర్ గౌడ్,నర్సిములు,పెర్మల్ రెడ్డి, పులిందర్ రెడ్డి,నగేష్ ప్రవీణ్,హన్మంత్,యాదయ్య, వెంకటేష్,క్రిష్ణ బండి శేఖర్,కొత్త బాల్ రాజ్,చెంద్రయ్య,శ్రీను,శ్రీకాంత్ గౌడ్, యాదగిరి,సిహెచ్ రాము,బాగల్ల రాములు, కబీర్ దాస్,గణేష్ నగేష్,క్రిష్ణ,ప్రశాంత్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
