రాష్ట్ర మానవ హక్కుల వేదిక పయనించే సూర్యుడు ఫిబ్రవరి 26:-రిపోర్టర్ (కే శివకృష్ణ ) చీరాల నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతంలో సి.ఆర్.జెడ్ ఉల్లంఘనలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడమే కాకుండా అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల వేదిక పేర్కొంది. మంగళవారం ఉదయం మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.రాజేష్, జి.రోహిత్ రాష్ట్ర చేనేత జన సమాఖ్య ప్రతినిధి గుంటూరు మల్లికార్జున్, ఓరుగంటి రెడ్డి రిజర్వేషన్ పోరాట సమితి ప్రతినిధి మేడి బోయిన వెంకటరెడ్డి తదితరులతో కూడిన బృందం వేటపాలెం మండలంలోని పొట్టి సుబ్బయ్య పాలెం, కటారిపాలెం, రామాపురం, చీరాల మండలం వాడరేవు గ్రామాలలో సముద్ర తీరంలోని బీచ్ రోడ్డు వెంబడి ఉన్న రిసార్ట్స్, హోటల్స్, హేచరీస్, వ్యాపార సంస్థలను పరిశీలించారు. ఈ సందర్భంగా వేదిక ప్రతినిధి రోహిత్ మాట్లాడుతూ సముద్రతీర ప్రాంతంలో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఇటీవల మీడియాలో వరుస కథనాలు వచ్చిన నేపథ్యంలో పర్యావరణ సమస్యలపై పనిచేస్తున్న వేదిక చీరాల ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. సి ఆర్ జెడ్ నిబంధనలను అతిక్రమించి జిల్లా యంత్రాంగం బీచ్ రోడ్డు చేపట్టడం ద్వారా చట్టాలకు తూట్లు పడుతున్నారని విమర్శించారు. బీచ్ రోడ్ లో నిర్మాణం చేసిన రిసార్ట్స్ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించి సముద్ర తీరం షెల్టర్ బెడ్ అయిన చదును చేసి లేట్ నైట్ పార్టీలకు విందు వినోదాలకు వినియోగిస్తుంటే అధికార యంత్రాంగం చేష్టలుడికి చూస్తున్నదనీ రోహిత్ ఆగ్రహం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు ఏకంగా రిసార్ట్స్ ప్రయోజనాల కోసం సముద్ర తీరంలో విద్యుత్ లైన్ ఏర్పాటు చేయటం విద్యుత్ శాఖ బాధ్యతారాహిత్యాన్ని స్పష్టం చేస్తుందన్నారు. కోస్టల్ మేనేజ్మెంట్ వెబ్ సైట్ మాయమైందని ఇది ప్రభుత్వం బాధ్యత రాయచటానికి నిదర్శనం అన్నారు.వేదిక బృందం వాడరేవు లోని మత్స్యకార మహిళలతో చర్చించి మత్స్యకార గ్రామాల సమస్యలను విచారించారు.