
{పయనించే సూర్యుడు} {ఏప్రిల్ 11 మక్తల్}
నారాయణ పేట్ జిల్లా మక్తల్ మండలంలోని ఐ బి బంగ్లా లో తెలంగాణ నాన్ గెజిట్ ఆఫీస్ విస్తృతస్థాయి సమావేశంను ఈ రోజు అనగా 2026 ఏప్రిల్ 10 వ తేదీన నిర్వహించు కోవడం జరిగింది ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, పరిష్కార మార్గాలపై తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంఘాల ప్రతినిదులందరం సుదీర్ఘంగా చర్చించూకోవడం జరిగింది. అనేక డిమాండ్లలో ప్రభుత్వం సత్వరం పరిష్కరించాల్సిన పలు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని ఈ విస్తృతస్థాయి సమావేశంలో ఎకగ్రీవంగా తీర్మానించడం జరిగింది.ఈ సమావేశంలో ప్రధాన డిమాండ్లు
జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ అమలు పరచాలి.రిటైరైన ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయాలి.
హెల్త్ కార్డ్స్ తక్షణమే అమలు చేయాలి. సీపీఎస్ రద్దు చేసి ఓపిఎస్ విధానంనుపునరుద్ధరించాలి.
2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి. పెండింగ్ బిల్లులతో పాటుగా పెండింగ్ డీఏలను విడుదల చేయాలి. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన సీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ
బదిలీలు చేపట్టాలి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక
కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఈ సమావేశంలో ప్రత్యక్ష కార్యాచరణ అమలు గురించి చర్చించుకోవడం జరిగింది * ఏప్రిల్ 17 - మండల, డివిజన్ కేంద్రాల్లో భోజన విరామ సమయంలో తహసీల్దార్లకు మెమోరాండంలు ఇచ్చి ప్రభుత్వానికి నివేదిక చేరేలా చూడటం,మే 5 - జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లుకు వినతిపత్రాలు అందజేయడంతో పాటు ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యతను తీసుకుంటాం.
ఈ యొక్క కార్యక్రమంలో మక్తల్ యూనిటీ ప్రెసిడెంట్ మునావర్ అలీ మరియు జనరల్ సెక్రెటరీ మదన్ మోహన్ రెడ్డి, ట్రెజరీ విజయ్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ మునెప్ప,జాయింట్ సెక్రటరీ యాదగిరి,జిల్లా వైస్ ప్రెసిడెంట్ సుజాత,విష్ణుప్ప,బాలరాజు, వైస్ ప్రెసిడెంట్ మురళీధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు
