(పయనించే సూర్యుడు అక్టోబర్ 22 రాజేష్)
CMRF చెక్కును దుబ్బాక శాసన సభ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాలతో అందజేసిన తాజా మాజీ ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్,మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సరుగారి యాదవ్ రెడ్డి గారల చేతుల మీదుగా పంపిణీ చేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా తిర్మలాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో సర్జరీ చేసుకొన్న వారికి తెలంగాణ ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా బిల్లును ప్రభుత్వం మంజూరు చేసింది.తిర్మలాపూర్ గ్రామానికి చెందిన కరికే రాణికి 17000/రూ,నక్క శాంతమ్మ 7500/రూ,కరికే రాజమణి 12500/రూ,గొల్ల సత్తవ్వ 29000/రూ,బండారు బాలవ్వ22000/రూ మొత్తం 88000/రూపాయలు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్,మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సరుగారి యాదవ్ రెడ్డి బి ఆర్ స్ పార్టీ నాయకులు వికలాంగుల అధ్యక్షుడు నర్సింలు,శ్రీకాంత్,చంద్రయ్యా, వెంకట్ రెడ్డి, లక్ష్మినర్సింహస్వామి,నాగరాజు,రమేష్,స్వామి,యాదవ్ రెడ్డి,మహిపాల్ రెడ్డి,కనరాజు,పోచయ్య,నర్సింలు,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.