పయనించే సూర్యుడు: జనవరి 12, ప్రతినిధి భూక్యా కవిత: జగ్గయ్యపేట పట్టణం తొర్రగుంటపాలెం నకు చెందిన దెందుకూరి సతీష్ 89,519 . ఆర్టీసీ కాలనీకి చెందిన ముద్ర శ్రీహరి 50,250 . పెనుగంచిప్రోలు మండలం కొనకంచి గ్రామానికి చెందిన బొల్లెపోగు జస్మిక 30,843 . జగ్గయ్యపేట మండలం అగ్రహారం గ్రామానికి చెందిన తేలుకుంట్ల ఐతంరాజు 51,250 సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) వారి నివాసంలో బాధితు కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉండి వైద్యం చేయించుకోలేని వారికి చేయూతనిస్తూ, వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అభాగ్యుల జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయనిధి వెలుగులు నింపుతుందని, అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేద ప్రజలకు మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి మన చంద్రన్న అడిగిన వెంటనే అపన్న హస్తం అందేలా చర్యలు తీసుకుంటున్నారని, ఆర్థిక స్తోమత లేని అనేకమందికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. లబ్ధిదారులు అందరూ కూటమి ప్రభుత్వం చేసిన సహాయాన్ని గుర్తించాలని అన్నారు. కష్టాలలో మనకు తోడుగా ఉన్న వారిని మర్చిపోకూడదని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎంతో మందికి సహాయం అందుతుందన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని అన్నారు. అడిగిన వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకి, శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.