
ప్రయాణించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో
బైంసా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముధోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించి సుమారు 70 సీఎం సహాయనిధి చెక్కులను ( సుమారు 23 లక్షల 32 వేయిల రూపాయిలు )లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. చెక్కులు మంజూరు చేసి ఇచ్చినందుకు *మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు * ముధోల్ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి . ఈ కార్యక్రమంలో కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గోనేలు కళ్యాణ్ మరియు భైంసా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి ఫరూక్ అహ్మద్, మరియు మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్లు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ లు,వైస్ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు, ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు, మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
