పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 5 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
హాసన్పర్తి మండలంలోని సీతా నాగారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి విచ్చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ని గ్రామ ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు మరియు మహిళలు, యువకులు బుక్స్ అందజేసి ఘన స్వాగతం పలికారు
అనంతరం గ్రామంలోని ప్రధాన కూడలి నుండి కార్యక్రమ స్థలానికి సాగిన ర్యాలీలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా సి ఆర్ ఆర్ నిధుల ద్వారా మంజూరైన రూపాయలు ఒక కోటి రూపాయల బీటీ రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు
అనంతరం గ్రామ మహిళ అధ్యక్షురాలుగా ఎన్నికైన మానస నీ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీలో బాగా కష్టపడాలి పలు సూచనలు సలహాలు చేశారు తదనంతరం గ్రామపంచాయతీలో పంపుసెట్ ఆపరేటర్ గా పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన దావా రాజేందర్ కుటుంబ సభ్యులకు పది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి వారి కుమారునికి చదువులకు అన్ని విధాలు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ప్రతి గ్రామానికి మౌలిక వసతులు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. రోడ్లు, డ్రైన్లు వంటి మౌలిక వసతులు కల్పన దిశగా అడుగులు వేస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పం, గ్రామాలను పల్లెలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది, ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం. ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం..
గ్రామీణ అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యత, ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం. నాణ్యతతో పనులు ఈ పనులు పారదర్శకంగా, నాణ్యతతో చేయాలన్నదే నా స్పష్టమైన ఆదేశం. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల ఈ సీసీ రోడ్లు మరియు డ్రైన్లు పూర్తయిన తర్వాత ప్రజలకు మంచి వాతావరణం, రవాణా సౌలభ్యం, శుభ్రత అందుతుంది..ప్రతి పథకం ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ తీసుకెళ్లే బాధ్యతను నేను గౌరవంగా తీసుకుంటున్నాను. ప్రజల సహకారం కీలకం అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరం. మీ ఆశీర్వాదం, మీ సహకారం నాకు బలంగా నిలుస్తుంది అన్నారు..అలాగే మీకు ఏ సమస్య ఉన్న నా డయల్ యువర్ ఎమ్మెల్యే 8096107107 కి ఫోన్ చేసి మీ సమస్య తెలియజేసే త్వరితగతన మీ సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తాను అన్నారు..ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పార్టీ అధ్యక్షుడు కుకట్ల రాజు, మాజీ దావా రవి, ఆత్మకుర్ ఏఎంసీ వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి, మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, మండల మహిళ అధ్యక్షురాలు శ్రీమతి జోరిక పూలక్కా తో మండల, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు..