పెండింగ్లో ఉన్న 9 వారాల ఉపాధి హామీ కూలి డబ్బులను వెంటనే విడుదల చేయాలి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అనేక సంవత్సరాలుగా సీనియర్ మేటుగా పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికులను ఫీల్డ్ అసిస్టెంట్ గా గుర్తించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు షాద్ నగర్ నియోజకవర్గం కన్వీనర్ శ్రీను నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం నాడు ఫరూక్ నగర్ మండలంలోని కడియాల కుంట తండా గ్రామంలో ఉపాధి హామీ పనిచేస్తున్న కార్మికులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకొని అనంతరం మాట్లాడుతూ ఎండలో పని చేస్తున్న ఉపాధి హామీ కార్మికులకు 9 వారాలుగా పెండింగ్లో ఉన్న కూలి డబ్బులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అదే విధంగా కనీస పని దినాలు 100 రోజుల నుంచి 200 రోజులకు పెంచాలని కనీస వేతనం 307 రూపాయల నుంచి 800 పెంచాలని మెజర్మెంట్ లేకుండా పని కల్పించాలని ఎర్రటి ఎండకు ఉపాధి కార్మికులకు మంచినీటి సౌకర్యం మెడికల్ కిట్టు అందుబాటులోకి తేవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పని కల్పించి జాబ్ కార్డులు ఇవ్వాలని ఆయన అన్నారు. ఇప్పటికే జిల్లా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసామని వెంటనే సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకొని కూలీలకు వారం వారం కూలీ డబ్బులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనిచో ఉపాధి హామీ కార్మికులతో ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు ఉపాధి కార్మికులు శంకర్, దీప్లా నాయక్, లింగం నాయక్, సంతోష్ నాయక్, లోక, ముత్యాలు, గౌరీ శంకర్, వెంకీ. తదితరులు పాల్గొన్నారు..