పంచాయతీ రికార్డుల తనిఖీ కోసం నంద్యాల కలెక్టర్ కి ఆర్టీఐ దరఖాస్తు
పయనించే సూర్యుడు ఆగష్టు 26(హైదరాబాద్ మాధవరెడ్డి)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నంద్యాల జిల్లా లో స్వచ్ఛంద సంస్థ కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ఆధ్వర్యంలో జిల్లా మెడికల్ ఆఫీసర్ కు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ రిజిస్ట్రేషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 ను ఉమ్మడి నంద్యాల జిల్లాలో పూర్తి స్థాయిలో అమలుకోసం పిటిషన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు కల్పించాలని, వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం ఆరోగ్య సేవలపైన సుప్రీంకోర్టు తీర్పుల మేరకు బాధ్యత వహించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పణ నంద్యాల జిల్లా కలెక్టర్ కు విద్యా హక్కు చట్టం పై సమాచార హక్కు చట్టం 2005 యాక్ట్ ప్రకారం అమలు జరుగుతున్న విధి విధానాలను తీసుకుంటున్న చర్యలను తెలియపరచాలని దరఖాస్తులను సమర్పించడం జరిగింది.ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సీసీర్ సభ్యులకు సంస్థ గుర్తింపు కార్డులు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు అశోక్ కాకర్ల ,నరేష్ బాబు కొమ్ము, న్యాయ సలహాదారుడు మణికంఠ,నంద్యాల జిల్లా సభ్యులు కుమ్మరి రామ్మోహన్,ఆత్మకూరు జిల్లా సభ్యులు జహీరుద్దీన్ నంద్యాల జిల్లా గార్లదిన్నె గ్రామ సభ్యులురమేష్ రాంబాబు,రామ పుల్లయ్య తదితరులు పాల్గొనడం జరిగింది..