“కేంద్ర నిధులతో అభివృద్ధి – కాంగ్రెస్ కు కనబడటంలేదా?”
“సత్యాన్ని కప్పిపుచ్చే కాంగ్రెస్ డ్రామా – అభివృద్ధిని అడ్డుకోవాలన్న కుట్ర”
“అభివృద్ధిపై కాంగ్రెస్ అసత్య ఆరోపణలు – ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు!”
బిజెపి యువ నాయకులు ప్రశాంత్ ముదిరాజ్…
( పయనించే సూర్యుడు మార్చి 6 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్ ) విట్యాల గ్రామంలో జరిగిన సిసి రోడ్డు ప్రారంభోత్సవాన్ని రాజకీయ రంగు అద్దాలని చూస్తున్న కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాన్ని విర్రవీగడం దారుణం. సిసి రోడ్లు ఎవరి నిధులతో వస్తాయనేది కాంగ్రెస్ పార్టీకి తెలియదా? కేంద్ర ప్రభుత్వ ప్రాముఖ్యతతో, పథకాలతోనే ఇలాంటి అభివృద్ధి జరుగుతుందని తెలియకపోతే, అవగాహన లేకపోవడమే కాని, నిజాలు తెలుసుకుని కూడా అర్ధసత్యాలు ప్రచారం చేయడం కాంగ్రెస్ పార్టీ దురాశను స్పష్టంగా బయటపెడుతోంది.గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి గ్రామీణ సడక్ యోజన (PMGSY), సెంట్రల్ రోడ్డు ఫండ్ (CRF), అలాగే 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రోడ్డు పనులకు భారీగా నిధులు కేటాయిస్తోంది. మరి ఈ నిధులు వాడి నిర్మాణం జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకోవాలనుకోవడం ఎంతవరకు న్యాయం? బిజెపి పార్టీ ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంది. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడం ప్రజా ప్రతినిధుల బాధ్యత. కానీ కాంగ్రెస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడం హాస్యాస్పదం.ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అభివృద్ధి పనులను అడ్డుకునే విధంగా కాకుండా, ప్రజలకు మేలు చేసే విధంగా వ్యవహరించాలని కాంగ్రెస్ నేతలకు సూచిస్తున్నాము.