సుండుపల్లి మండల అధ్యక్షులు ఎస్ వి రామన్ గౌడ్ మాట్లాడుతూ.
ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. 2018 డిసెంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీని కింద సాగు చేసే భూమి ఉన్న రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తుంది. ఏడాదికి రూ. 6 వేలను ఈ స్కీమ్ కింద రైతులకు ఇస్తుంది. ఇక్కడ డబ్బులు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ( డి బి టి ) ద్వారా జమవుతాయి. రూ. 6 వేలను ఒకేసారి అందించదని గుర్తుంచుకోవాలి. ఇక్కడ విడతల వారీగా అందిస్తుంది. ప్రతి విడతకు రూ. 2 వేల చొప్పున ప్రతి 4 నెలలకు ఓసారి 3 విడతలుగా ఇస్తుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు 18 విడతల డబ్బుల్ని విడుదల చేసింది. ఇప్పుడు 19వ విడత కోసం ఎదురుచూస్తున్నారు రైతులు. 18వ విడతలో 10.32 కోట్ల మంది లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ లో పనిచేస్తున్న మన్సూర్, కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు