పయనించే సూర్యుడు జనవరి 29 అశ్వాపురం ప్రతినిధి :
సీపీయం నాయకులు సర్గం బాల నర్సయ్య, భారజాల కర్మాగార రిటైర్ ఎంప్లొయ్ నాగభూషణం పేద పిల్లలకు వితరణ గా అందచేసిన రూపాయలు 20 వేల తో 20 మంది లబ్ధిదారులకు సుకన్య సమృద్ధి యోజన కింద పాస్ బుక్ లు పంపిణి చేసారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సి పి యం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. కార్యక్రమం లో టిజెస్ నాయకులు సురకంటి ప్రభాకర్ రెడ్డి, బండారు రవీందర్ రెడ్డి, సీపీయం నాయకులు పినికేసి సుధాకర్ రెడ్డి, పగడాల అశోక్ రెడ్డి, తూము వెంకన్న, బద్దం శంబిరెడ్డ్, మంగి వెంకట రమణ, ఆవుల సుధాకర్, భూర్గంపాడు నాయకులు వెంకటేశ్వర్లు,బొమ్మ రాతి రామయ్య,అశ్వాపురం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ప్రేమ కుమారి, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ పూజిత, లబ్ధిదారులు పాల్గొన్నారు.